Friday, 2 December 2016

*త్యాగాలు ప్రజలవి - భోగాలు నాయకులవి*

ఇందిరాగాంధీ మొదలుకొని తదుపరి వచ్చిన మురార్జీ, చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, వీపీ సింగ్ నుంచి నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు* చెప్పే ఒక స్టాక్ డైలాగ్ *"ప్రజలు త్యాగాలు చెయ్యాలి"* .
*నిజమే.. ప్రజలు త్యాగాలు చెయ్యాలి.*
👉తమకు వచ్చే వంద రూపాయల గ్యాస్ సబ్సిడీని వదులుకోవాలి.
👉నాయకులు మాత్రం తమకు లభించే ఏ సబ్సిడీని వదులుకోరు.
👉బయట 200 రూపాయలు ఉండే బిర్యాని ని వారు మాత్రం ఇరవై రూపాయలకే ఆరగిస్తారు.
👉 ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అనుభవిస్తారు.
👉 ప్రజలు చచ్చి చెడి తమ కష్టార్జితం లోనుంచి నానా తిప్పలు పడి అధిక చార్జీలు చెల్లించి ప్రయాణాలు చేస్తారు.
👉నాయకులు మాత్రం విమానాలలో ఉచితంగా ప్రయాణాలు చేస్తారు.
👉 లక్ష రూపాయలుగా ఉన్న తమ వేతనాలను అమాంతం నాలుగు లక్షలకు పెంచుకుంటారు.
👉 తమ నియోజకవర్గాలలో ప్రజాధనం తో సమకూర్చిన వాహనాలలో దర్జాగా ప్రయాణిస్తారు. బస్సుల్లో, రైళ్లలో, విమానాలలో తమకు లభించే ఏ విధమైన రాయితీని విసర్జించరు.
*ప్రజలు మాత్రం త్యాగాలు చెయ్యాల్సిందే.*
👉మీకు చిన్న చిన్న రోగాలు వస్తే ప్రజల ఖర్చు తోవిదేశాలు వెళ్లి వైద్యాలు చేయించుకుంటారు.
👉 ప్రజలు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులలో ఛీత్కారాలు భరిస్తూ ఒక్కో బెడ్ మీద ముగ్గురు పేషేంట్స్ తో పడుకోవాలి. లేదా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి ఇల్లూవాకిళ్ళు, పొలాలు పుట్రలు అమ్మేసుకుని దివాళా తీయాలి.
*అవును మరి.. ప్రజలు త్యాగాలు చెయ్యాలి.*
👉గత రెండురోజులు గా సోషల్ మీడియా లో చాలామంది వీరదేశభక్తులు కొత్త లాజిక్స్ ను పోస్ట్ చేస్తున్నారు. *"మీరు తిరుపతి, శ్రీశైలం, షిరిడీ వెళ్ళినప్పుడు, రైల్వే స్టేషన్స్ లో టికెట్స్ కోసం ఏడెనిమిది గంటలు నిల్చోవడం లేదా?*
ఏటీఎం ల దగ్గర గంట సేపు నిలుచోలేరా? " అని తమ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
నిజమే... సామాన్య ప్రజలు గంటలతరబడి నిలుచుని తమ సమయాన్ని త్యాగం చేస్తారు. మరి నాయకులు?
👉 *తిరుపతిలో, షిరిడీ లో ఏనాడైనా క్యూలలో నించున్నారా?*
*మహాద్వారం నుంచి మహారాజుల్లా తమ కుటుంబాలతో సహా గర్భగుడి వరకు దూసుకుని పోతారేం? స్వామివారితో అరగంట సేపు గడుపుతారు. శేషవస్త్రాలు, ప్రసాదాలు స్వీకరిస్తారు. ప్రత్యేక ఆశీర్వచనాలు తీసుకుంటారు... మరి వారు ఎందుకు త్యాగం చెయ్యరు?*
👉 *ఒక నాయకుడికి అధికారం ఇచ్చింది దేనికి?*
👉 ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందిస్తారు అనేగదా?
*నేను కొత్త సంస్కరణలు తీసుకువస్తాను...మీరు ఓపికపట్టండి అని చెప్పని నాయకుడు ఎవరైనా గతంలో ఉన్నారా?*
👉 ఆర్ధిక సంస్కరణల ఫలితాలు రెండు ఏళ్లలో కనిపిస్తాయి...వస్తువులు చౌకగా లభిస్తాయి. ప్రజలు త్యాగాలకు సిద్ధపడాలి అని చెప్పారు పీవీ నరసింహారావు.. ఆ తరువాత వాజపేయి, మన్మోహన్ కూడా ఇదే పాట పాడారు.
ఇరవై ఏళ్ల తరువాత కూడా వాటి ఫలితాలు పూర్తిగా కనిపించాయా?
👉దేశం లో పేదరికం నలభై ఏళ్ళక్రితం 70 శాతమే ఉన్నది. ఇప్పుడూ అంతే ఉన్నది. ప్రజలు మాత్రం త్యాగాలు చేస్తూనే ఉన్నారు.
👉పాత నోట్ల రద్దు ద్వారా నల్లధనం బయటకి తీయవచ్చు అని మోడీ భావించారు. బాగుంది. నేను కూడా హర్షించాను. కానీ మోడీ ఊహించిన విధంగా జరుగుతున్నదా?
👉 దేశం లో 18 లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉన్నది అని కేంద్రం చెప్తున్నది. మరి ఈ సంస్కరణ ద్వారా ఫలితం లేకపోతె ప్రధాని తన చర్యకు మూల్యం చెల్లిస్తారా?
👉పైగా మరో విచిత్రమైన సంగతి ఏమిటంటే... ఈ నిర్ణయం మంత్రివర్గం సమావేశం లో తీసుకుని ప్రధాని బయటకి వెళ్లి రాష్ట్రపతి ని కలిశారు. టీవీ లో లైవ్ ఇచ్చి ప్రకటించారు. అప్పటివరకు మంత్రులు అందరిని సమావేశ హాల్ లోనే బంధించేశారట...ఎందుకయ్యా అంటే.. మంత్రులు బయటకి వెళ్తే ఈ నోట్ల రద్దు విషయం లీక్ అవుతుందని భయం ట...
ఎంత దారుణం? అంటే... తన మంత్రుల మీద తనకే నమ్మకం లేదన్న మాట!! మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు అత్యంత గోప్యం...ఈ రహస్యాలు కాపాడుతారని నమ్మకం మోడీ కి తన మంత్రులమీద లేనప్పుడు అలాంటి వారిని మంత్రివర్గం లో కొనసాగించడం ఎంతవరకు సమంజసం? ఇది మంత్రులకు అవమాసం కాదా? అంతా ఏకపాత్రాభినయం కాదా ఇది? మోడీ గారు తన మంత్రులను నమ్మరు. ప్రజలు మాత్రం మోడీగారిని నమ్మాలి! దట్స్ ఆల్!
👉 *నా చిన్నప్పటినుంచి వింటున్న మరో గొప్ప ఆణిముత్యం ఏమిటంటే "ఈ దేశం నీకేమి ఇచ్చిందని అడగకూడదు... ఈ దేశానికి నువ్వు ఏమిచ్చావు?*"
👉 *ఎందుకు ఇవ్వడం లేదు? నాకొచ్చే జీతం లో నలభై శాతం వివిధ పన్నుల రూపం లో కడుతున్నాను.*
*అది కాక బయట ఏ వస్తువు కొన్నా సర్వీస్ టాక్స్, స్వచ్ భారత్ టాక్స్, కృషికళ్యాణ్ టాక్స్ కలిపి పదిహేను శాతం కడుతున్నా.*
*అనగా నా ఆదాయం లో సగభాగం నేను దేశానికి ఇస్తున్నా...*
పొట్టపొడిస్తే అక్షరం ముక్క రానివారిని కూడా ఈ దేశం మంత్రులను చేసింది. మీరు వేలకోట్ల అవినీతి సొమ్మును కొల్లగొడుతున్నా భరిస్తున్నది. మాలాంటి వాళ్ళు ఇరవై రెండు ఏళ్లపాటు వివిధ విద్యాలయాలలో చదివి ఎంతో జ్ఞానం సంపాదించుకుని గుమాస్తాలుగా ఎద్దుల్లా చాకిరీ చేస్తున్నాము.
👉 *నాయకులకు నేను వేస్తున్న సూటి ప్రశ్న... "ఈ దేశం మీకు చాలా ఇచ్చింది... మీరు ఈ దేశానికి ఏమి ఇచ్చారు? "*
జవాబుందా చెప్పండి..!!

(మిత్రుడు వార‌ణాసి నాగార్జున ఫేస్ బుక్ పేజీ నుంచి)

No comments:

Post a Comment