Thursday, 15 December 2016

S&P says India's demonetisation hurts confidence in RBI

India's surprise move to abolish high-value rupee notes has undermined the central bank's reputation for competence and independence, even as it remains a credible institution, Standard & Poor's director Kyran Curry said on Wednesday.

The comments come as the Reserve Bank of India (RBI) and the government face criticism for their implementation of the demonetisation initative in November, abolishing 500 and 1,000 rupee notes ($7.41-$14.82), which accounted for 86 percent of the currency in circulation.

The slow replacement of the abolished bills has sparked a shortage of cash that has hit large parts of the economy, and the RBI and government have had to subsequently announce a series of ad hoc measures to ease the impact of the measure.

At the same time some policy makers, including former Prime Minister Manmohan Singh, now part of the opposition, has also questioned the RBI's independence for agreeing to implement the action without much preparation.

Curry, in a teleconference with media, said demonetisation had undermined confidence in the predictability and effectiveness of policymaking in India, including of the RBI.

"Demonetisation has cast a shadow over the RBI's competence and independence," Curry said.

However, he also noted that "we still think this institution is a very credible one, and in terms of the conduct of monetary policy, it's a very mature institution."

The RBI under Governor Urjit Patel has also been criticised recently after surprising investors by keeping interest rates on hold last week, the second time in a row it has wrong-footed investors with its monetary policy decision.

రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా... ప్ర‌తిష్ట మ‌స‌క‌బారుతోందా?.. రాజ‌కీయాల‌కు అది వేదిక‌గా మారుతోందా?. అవున‌నే చెపుతోంది  ఎస్&పి అంత‌ర్జాతీయ రేటింగ్ కంపెనీ. అనేక యేళ్లుగా నిక్కచ్చి పని విధానంతో, ఉన్నత స్ధాయి ప్రమాణాలతో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీమానిటైజేషన్ వల్ల ఒక్కసారిగా పరువు పోగొట్టుకుందని చెప్పడం.

“కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు చర్య సెంట్రల్ బ్యాంకు సమర్ధత, స్వతంత్రతలను మంటగలిపింది” అని ఎస్&పి తన నివేదికలో పేర్కొంది. ఇప్పటికీ ఆర్‌బి‌ఐ విశ్వసనీయమైన వ్యవస్ధగా కొనసాగుతున్నప్పటికీ డీమానిటైనేషన్ వల్ల సంస్ధ సంపాదించిన గొప్ప లక్షణాలకు మచ్చ వచ్చి చేరిందని ఎస్&పి స్పష్టం చేసింది.

ఆర్‌బి‌ఐ ఇన్నాళ్లూ కనబరిచిన సమర్ధత ఏమిటి? రాజ్యాంగం తనకు అప్పగించిన పనిని ఎటువంటి రాగద్వేషాలకు తావు ఇవ్వకుండా, అధికారంలో ఉన్న పార్టీలు, నేతల ఒత్తిళ్లకు తల ఒగ్గకుండా దేశంలోని మానిటరీ పరిస్ధితులు ఏ నిర్ణయాలనైతే డిమాండ్ చేస్తున్నాయని తాను భావిస్తున్నదో సరిగ్గా అదే నిర్ణయాలను తీసుకోవడమే ఆర్‌బి‌ఐ కనపరిచిన సమర్ధత.

రాజ్యాంగం ఆర్‌బి‌ఐ కి స్వతంత్రంగా పని చేయమని నిర్దేశించింది. గవర్నర్ గా ఎవరిని నియమించాలి అన్న అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉన్నప్పటికీ, దాదాపు ఇప్పటి వరకు పని చేసిన గవర్నర్లు అందరూ కేంద్ర ప్రభుత్వ అవసరాలకు, ప్రభావాలకు లొంగకుండా పని చేశారని ఎస్&పి పరోక్షంగా చెప్పింది.

 ఆర్‌బి‌ఐ స్వతంత్రను కూడా మోడి ప్రభుత్వం లాగేసుకుంది. నిజానికి నోట్ల వ్యవహారం ఆర్‌బి‌ఐ అధికార పరిధిలోనిది మాత్రమే. దేశంలో ఎంత డబ్బు చలామణిలో ఉండాలి, ఎప్పుడు ఏయే నోట్లు కొత్తవి ప్రవేశపెట్టాలి, ఏయే నోట్లు ఉపసంహరించాలి… ఇవన్నీ ఆర్‌బి‌ఐ తన స్వతంత్ర ఆలోచన, ఆర్ధిక సిద్ధాంతాల మేరకు నిర్ణయించవలసినవి. కానీ మోడి ప్రభుత్వం ఆర్‌బి‌ఐ గవర్నర్ అధికారాలను లాగేసుకుని మానిటరీ కమిటీ పేరుతో ఆర్‌బి‌ఐ నిర్ణయాధికారాలలోకి చొరబడింది.

డీమానిటైజేషన్ వల్ల దేశంలో ఎంత అల్లకల్లోలం చెలరేగుతుందో ఆర్‌బి‌ఐ గవర్నర్ చక్కగానే ఊహించగలరు. కేంద్ర ప్రభుత్వం చొరబాటు లేనట్లయితే ఇంత అప్రజాస్వామిక చర్యకు ఆర్‌బి‌ఐ పూనుకుని ఉండేది కాదు. బహుళజాతి కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం పని చేసే రాజకీయ ప్రభుత్వం తన మాస్టర్ ప్రయోజనంతో పాటు తన సొంత రాజకీయ ప్రయోజనం కూడా తరుముకుని రావడంతో హడావుడిగా భారీ ఎత్తున డీమానిటైజేషన్ ప్రకటించారు. ‘నల్ల ధనంపై పోరాటం” అంటూ తమ అప్రజాస్వామిక చర్యకు ‘ప్రజాస్వామిక ముసుగు’ తొడిగారు.

వాస్తవానికి కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు నెరవేర్చినందుకు ఎస్&పి ‘డీమానిటైజేషన్’ కు మద్దతు ఇవ్వాలి. “దీర్ఘకాలికంగా ప్రయోజనకరమే” అని చెప్పడం ద్వారా ఆ ప్రయోజననాన్ని ఎస్&పి గుర్తించింది కూడా. కానీ డీమానిటైజేషన్ ను అమలు చేసిన విధానం మాత్రం కంపెనీకి నచ్చలేదు. ఎలాంటి ఏర్పాట్లు, ముందస్తు అంచనాలు లేకుండా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకునేలా అమలు చేయడం వల్ల లాభం కంటే నష్టం వచ్చే పరిస్ధితి వచ్చిందని ఎస్&పి అంచనా వేసింది.

దీర్ఘకాలికంగా ఏ ప్రయోజనం వస్తుందో ఇంతవరకు చెప్పినవారు లేరు. “3 నుండి 5 లక్షల కోట్ల వరకు వెనక్కి రాదు, అది ప్రభుత్వానికి డివిడెండ్ గా వస్తుంది. ఆ డబ్బుతో పలు సంక్షేమ చర్యలు చేపట్టవచ్చు” అని చెప్పారు గానీ అనుకున్నదాని కంటే ఎక్కువ మొత్తం బ్యాంకులకు చేరడంతో అదేమీ జరగదని తేలిపోయింది. అనుకున్నట్లు కొంత డబ్బు వెనక్కి రాకపోయినా కేంద్ర ప్రభుత్వానికి వచ్చేది ఏమీ ఉండదని ఆర్‌బి‌ఐ గవర్నర్ ఇప్పుడు చెబుతున్నారు.

వడ్డీ రేట్లు తగ్గుతాయి అన్నారు. తగ్గలేదు సరికదా, ఉన్న రేటునే ఆర్‌బి‌ఐ కొనసాగించింది. నల్ల డబ్బు వెలికి వస్తుంది అన్నారు. కానీ కొత్త నోట్లు కూడా నల్ల బజారులో కుప్పలు కుప్పలుగా ప్రత్యక్షం అవుతున్నాయి. వెలికి రాకపోగా పాత నల్ల డబ్బు తెల్ల ధనంగా బ్యాంకులకు చేరడమే కాకుండా కొత్త నోట్లలో నల్ల ధనం పేరుకుపోతున్నది. ఇక ‘నల్ల ధనంపై పోరాటం’ ఎక్కడ చేస్తున్నట్లు? నల్ల నోటు అంటే ఏమిటో తెలియని అమాయక జనం మాత్రం క్యూలల్లో నిలబడలేక చనిపోతున్నారు. చనిపోతున్నవారికి కనీసం సానుభూతి ప్రకటించడం కూడా లేదు.

ఈ నేపధ్యంలో “డీమానిటైజేషన్ ఆర్‌బి‌ఐ సమర్ధత, స్వతంత్రతల పైన నల్లటి నీడను పరిచింది” అని ఎస్&పి నిర్మొహమాటంగా తేల్చి చెప్పింది. మానిటరీ పాలసీ నిర్వహణకు సంబంధించి ఈ సంస్ధ అత్యంత విశ్వసనీయమైన సంస్ధ అని ఇప్పటికీ మేము నమ్ముతున్నాము. కానీ డీమానిటైజేషన్ వల్ల ఆర్‌బి‌ఐ పైన నమ్మకాన్ని దెబ్బ తీసింది.  అని ఎస్&పి పేర్కొంది.

No comments:

Post a Comment