మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. జయలలిత మృతిపై మద్రాస్ హైకోర్టు జడ్జి కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే అవి తన వ్యక్తిగతం అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు దేశంలో ఒక్కసారిగా కలకలం రేపాయి. జయ మరణంపై అనుమానాలు ఉన్నాయన్ని హైకోర్టు జస్టిస్ వైద్యనాథన్ వ్యాఖ్యానించారు. హైకోర్టులో దాఖలైన పిల్‌పై విచారణ సందర్భంగా జడ్జి ఈ వ్యాఖ్యలు చేశారు. జయలలితకు ఎలాంటి చికిత్స అందిందో కేంద్రానికి తెలుసు. కానీ ఎందుకు మౌనంగా ఉందో.. ఎందుకు గోప్యత పాటించిందో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు.
జయ మృతిపై జనవరి 9లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు, నోటీసులు జారీ చేశారు. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని తీవ్రంగా మందలించారు. జయలలిత మరణంపై దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ వైద్యనాథన్, జస్టిస్ పార్తిబన్ ధర్మాసనం విచారించింది. తాను ఒక్కడినే ఈ పిటిషన్లను విచారించాల్సి వస్తే పరిస్థితి మరోలా ఉంటుందని జస్టిస్ వైద్యనాథన్ వ్యాఖ్యానించడం మరో విశేషం. రాబోయే రోజుల్లో ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
No comments:
Post a Comment