Thursday, 1 December 2016

అసాంజే పై బ్రిట‌న్ అప్పీల్ తిర‌స్క‌ర‌ణ‌

వికీ లీక్స్ చీఫ్ ఎడిటర్ జులియన్ అసాంజే విడుదలకు అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ విష‌యాన్ని రాయ్ ట‌ర్స్ వార్తా సంస్థ తెలియ‌జేసింది. అసాంజేను వెంటనే విడుదల చేసి నష్టపరిహారం చెల్లించాలని కోరిన ఐరాస తీర్పుకు వ్యతిరేకంగా బ్రిటన్ చేసిన అప్పీలును ఐరాస రెండోసారి కూడా తిరస్కరించింది. దీనితో అసాంజే విడుదలకు అన్ని అడ్డంకులు తొల‌గిన‌ట్లే. నాలుగు సంవత్సరాలుగా లండన్ లోని ఈక్వడార్ ఎంబసీలో అసాంజే బందీగా ఉన్నారు.  అతనిపై స్వీడన్‌లో అత్యాచార కేసు నమోదైంది. అసాంజే తనను రేప్ చేసినట్లు ఓ యువతి ఫిర్యాదు చేసింది. దానిపై ప్రస్తుతం అతను కేసును ఎదుర్కొంటున్నాడు. ఒకవేళ స్వీడన్‌కు తనను అప్పగిస్తే, ఆ దేశం తనను అమెరికాకు అప్పగిస్తుందని అసాంజే అనుమానిస్తున్నాడు. అసాంజేను తమకు అప్పగించాలని స్వీడన్ ప్రభుత్వం కోరడంతో అసాంజే ఈక్వడార్ ఎంబసీలో తలదాచుకున్నాడు. అసాంజే ఎంబసీ నుండి బైటికి వస్తే అరెస్టు చేసి స్వీడన్ తరలించడానికి అప్పటి నుండి లండన్ పోలీసులు ఈక్వడార్ ఎంబసీని వేయి కళ్లతో కాపలా కాస్తున్నారు. ఎవరిదగ్గరైనా ఏ ప్రభుత్వానికిగానీ, సంస్థకు గానీ  సంబంధించిన రహస్య పత్రాలు, దస్తావేజులు, చిత్రాలు, వీడియోలు, గుప్త సమాచారాన్ని అజ్ఞాతంగా పంచుకునేందుకు ఒక వేదికగా ఏర్పడ్డ ఒక స్వచ్చంద సంస్థ వీకీలీక్స్. దీని డొమైన్ అక్టోబర్ 4, 2006 లో నమోదు చేసుకున్నప్పటికీ డిసెంబర్ 2006 లో దీన్నుంచి ప్రథమంగా కొన్ని రహస్య పత్రాలు వెలువడ్డాయి. స్థాపించిన అనతి కాలంలోనే వికీలీక్స్ ఎన్నో ప్రశంసలను, బహుమతులను అందుకొంది. ఎకానమిస్ట్ పత్రిక వారి, న్యూమీడియా బహుమతి, 2008లో  ప్రచురించిన కెన్యా ద క్రై ఆఫ్ బ్లడ్ కి గాను జూన్ 2009లో  వీకీలీక్స్ కు, అసాంజేకు ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ బహుమతి లభించింది.  మే 2010లో, న్యూయార్క్ డైలీ న్యూస్ వీకీలీక్స్ ని ప్రపంచ చరిత్రలో వార్తా ప్రచురణ విప్లవం సృష్టించిందని పేర్కొంది. ఏప్రిల్ 2010లో వీకీలీక్స్ ఒక వీడియోను వెబ్‌సైట్లో ప్రదర్శించింది. ఇందులో సామూహిక హత్య అన్న శీర్షికతో, 2007 లో బాగ్ధాద్ లో ఇరాక్ దేశస్తులను అమెరికా సైనికులు హతమార్చిన వైనం ఉంది. అదే సంవత్సరం జూలైలో, ఆఫ్గన్ వార్ డైరీ పేరుతో 76,900 పైగా పత్రాలను వార్ ఇన్ ఆప్ఘనిస్తాన్ అన్న పేరుతో విడుదల చేసింది. అక్టోబర్ లో దాదాపు 4ల‌క్ష‌ల పత్రాల ఇరాక్ వార్ లాగ్స్ అన్న అంశంతో విడుదల చేసి సంచలనం సృష్టించింది. దీంతో అగ్రరాజ్యాధినేతల్లో ప్రకంపనలు సృష్టించింది. అసాంజే కొన్నేళ్ల క్రితం అమెరికా ప్రభుత్వానికి చెందిన వేలాది రహస్య పత్రాలను విడుదల చేశాడు. ఇక్క‌డే అసాంజేకు వ్య‌తిరేకంగా కుట్ర జ‌రిగింది. 
త‌న‌పై వ‌చ్చిన అత్యాచారం ఆరోపణలను అసాంజే తిరస్కరించాడు. ఆరోపణలు చేసిన ఇద్దరు స్త్రీలలో ఒకరు తన ఆరోపణలను ఉపసంహరించుకోగా మరో స్త్రీ సీఐఎ ఏజెంటుగా పత్రికలు ధృవీక‌రించాయి. అమెరికా దౌత్య రహస్యాలను వికీలీక్స్ వెల్లడి చేసినందుకు గాను అమెరికాలో అసాంజేకు వ్యతిరేకంగా రహస్య జ్యూరీ ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నారని, అక్కడికి వెళితే తనకు సరైన న్యాయం దక్కుతుందన్న నమ్మకం లేదని అసాంజే వివరించాడు. ఈ నేపథ్యంలో జులియన్ అసాంజే నిర్బంధం చట్ట విరుద్ధమ‌ని, మానవ హక్కులను హరించడమే అనీ గ‌తంలో ఐక్య‌రాజ్య‌సమితి సంస్ధ తీర్పు చెప్పింది. అసాంజే ఫిర్యాదును పురస్కరించుకుని విచారణ చేసిన ఐరాస ఆయనను విడుదల చేసి నష్టపరిహారం కూడా చెల్లించాలని బ్రిటన్, స్వీడన్ లను కోరింది. అయితే ఐరాస తీర్పును బ్రిటన్ తిరస్కరించింది. తాము అసాంజేను బంధించలేదని తానే స్వయంగా ఈక్వడార్ ఎంబసీలో బంధితుడుగా వెళ్లాడని వాదించింది. తీర్పును మార్చాలని రెండు సార్లు అప్పీలు చేసింది. బ్రిటన్ అప్పీలును మ‌రోసారి ఐరాస తిరస్కరించింది. 
అప్పీలు తిరస్కరణ నేపథ్యంలో బ్రిటన్, స్వీడన్ లు తమ అంతర్జాతీయ న్యాయ బాధ్యతలను పాటించి తనను విడుదల చేయాలనీ అసాంజే ఒక ప్రకటనలో కోరాడు. రెండవ సారి కూడా బ్రిటన్ అప్పీలు తిరస్కరణకు గురయినందున ఐరాస తీర్పును తిరగదోడాలన్న బ్రిటన్ ప్రయత్నాలు ఇక ముగిసినట్లే అని చెపుతున్నాడు. అత్యాచారం కేసుకు సంబంధించి కొద్ది నెలల క్రితం స్వీడన్ పోలీసులు లండన్ వచ్చి అసాంజేను విచారించారు. గతంలో ఈ విధంగా లండన్ వచ్చి విచారించేందుకు స్వీడన్ పోలీసులు నిరాకరించారు. స్వీడన్ రావలసిందేనని పట్టుబట్టారు. ఈ నాలుగేళ్లలో అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో స్వీడన్ దిగిరాక తప్ప లేదు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వికీలీక్స్ ఎడిటర్ లండన్ లో ఒక ఎంబసీలో 4 సంవత్సరాలుగా బందీగా ఉండడం, అనారోగ్యానికి గురి కావడం… ఇవన్నీ ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి కారణాలుగా నిలిచాయి. మానవ హక్కుల విషయంలో ప్రపంచానికి హితబోధలు చేసే లండన్, స్టాక్ హోమ్ లు తామే మానవ హక్కుల అణచివేతదారులుగా ప్రపంచం ముందు దోషులుగా నిలబడవలసి పరిస్ధితి ఏర్పడింది. మరింత అప్రతిష్ట మూటగట్టుకోక ముందే ఈ వ్యవహారానికి ముగింపు పలకడానికి ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతోంది. 
(రాయ్ ట‌ర్స్ క‌థ‌నం కూడా ఇస్తున్నాను)

UN ruling to free WikiLeaks’ Assange to stand after British appeal rejected

The United Nations has rejected a UK appeal against its previous ruling in favor of Julian Assange as "inadmissible," thus requiring both London and Stockholm to end the WikiLeaks founder’s "arbitrary detention."
Earlier this year, a case was concluded at the UN, in which the body instructed the UK and Sweden to take immediate steps to ensure the WikiLeaks founder's liberty, protection and enjoyment of fundamental human rights.
The UK has appealed the ruling twice, with the UN rejecting its second appeal on Wednesday by pronouncing it "not admissible," Justice for Assange reported, adding that the decision marks the end to London's "attempt to overturn the ruling."
"Now that all appeals are exhausted, I expect that the UK and Sweden will comply with their international obligations and set me free," a statement by Assange read, with the fugitive whistleblower calling his detention "an obvious and grotesque injustice."
The recent development in the Assange case at the UN forces the UK and Sweden - which are parties to his case - "to immediately put an end to Mr. Assange's arbitrary detention and afford him monetary compensation," Justice for Assange stated, adding that a failure to do so would undermine the UN human rights' protection system.
Julian Assange faces potential, but as yet unfiled charges over rape allegations in Stockholm that date back to 2010. The whistleblower has always denied the accusations, saying that being taken to Sweden would pave the way for a further extradition to the US, where the government has launched a criminal investigation into WikiLeaks following a 2010 diplomatic cables leak.
He has been sheltered by the Ecuadorian Embassy in London since August 2012. Earlier this month, Swedish investigators came to interview Assange inside the embassy concerning rape charges, with the whistleblower saying he has "cooperated fully" with them.

No comments:

Post a Comment