Friday 2 December 2016

ప్రియ‌మైన మోదీ గారికి...

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో మోడీకి నెటిజ‌న్లు సంధిస్తున్న ప్ర‌శ్న‌లు? .చాలా ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. ఇందులోని వాస్త‌వాలు మీకూ తెలుస్తాయి. ఓ లుక్కేయండి....

మోడీ సార్‌.. ఈ ప్రశ్నలకు జవాబు చెప్తారా?

1. 2014లో కరెన్సీ మార్పిడిని వ్యతిరేకించారు.
2016లో మీరే కరెన్సీ మార్పిడి చేశారు.
2. 2013లో కందిపప్పు ధర పెరిగితే దేశవ్యాప్త ఆందోళన చేశారు.
2016లో మీ హయాంలోనే కంది పప్పు కిలో రూ.200కు పైగా పెరిగింది.
3. మీ పార్టీ గో హత్యను వ్యతిరేకిస్తున్నది.
 మీ హయాంలోనే బీఫ్‌ ఎగుమతిలో మన దేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్నది. 
4. మన్మోహన్‌సింగ్‌, నవాజ్‌ షరీఫ్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇస్తేనే విమర్శించారు.
పిలువకుండానే మీరు షరీఫ్‌ జన్మదినానికి వెళ్లి కేక్‌ తిన్నారు. 
5. గతంలో ఎఫ్‌డీఐ, జీఎస్‌టీ, ఆధార్‌ని విమర్శించారు.
ప్రస్తుతం వాటిని మీరు అమలు చేస్తున్నారు.
6. 'నిర్భయ' ఘటనపై గతంలో మూడు నెలలపాటు ఆందోళన చేశారు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ప్రతిరోజూ 12 లైంగికదాడులు, ఢిల్లీలో ఏడు లైంగికదాడులు జరుగుతున్నా మీరు చప్పుడు చేయడం లేదు.
7. 2004-2014 మధ్య కాలంలో రైల్వే చార్జీలు పెంచితే ఆందోళన చేశారు.
మీ హయాంలో రెండు సంవత్సరాల్లోనే 40 శాతం మేర చార్జీలు పెరిగాయి.
8. యూపీఏ కాలంలో ప్రపంచంలో పెట్రోలు బ్యారల్‌ ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎడ్ల బండి ర్యాలీ నిర్వహించారు.
మీ కాలంలో పెట్రోలు బ్యారల్‌ ధర భారీగా పడిపోయినప్పటికీ మీరు రూ.70కి లీటరు పెట్రోలు అమ్ముతున్నారు.
9. బీజేపీ ముఖ్యమంత్రులైన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ రాజ్యంలో వ్యాపం స్కాం, వసుంధరరాజే హయాంలో లలిత్‌ మోడీ స్కాం, 34 వేల కోట్ల అన్న వితరణ స్కాంలు జరిగినా వారి రాజీనామాలు మీరు కోరలేదు.
ఇతర పార్టీల పాలనలో ఇలాంటివి జరిగితే మాత్రం మీరు వెంటనే వారి రాజీనామాకు డిమాండ్‌ చేస్తారు. 
10. మీరు 24 గంటలు పని చేస్తున్నారని మీ భక్తులు చెబుతారు.
 రెండున్నరేండ్ల కాలంలో దేశంలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. 
11. 100 రోజుల్లో విదేశాల్లో దాచి ఉంచిన నల్లధనం తెస్తానన్నారు.
700 రోజులు దాటినా దానిపై పురోగతి లేదు.
12. రైతుల ఉత్పత్తి పైన 50 శాతం లాభం ఇస్తానని హామీనిచ్చారు.
గడిచిన రెండేండ్లలో ఒక్క రూపాయి కూడా పెంచలేదు.
ఇట్లు
దేశభక్తుడు

No comments:

Post a Comment