Wednesday 28 December 2016

పాతనోట్లు ఉంటే 4 ఏళ్ల జైలు శిక్ష


కేంద్ర కేబినెట్ పాత నోట్లపై కొత్త నిర్ణయం తీసుకుంది. పాత నోట్లు కలిగి ఉంటే చర్యలు తీసుకునేలా ఆర్డినెన్స్ ను రూపొందించింది. వచ్చే మార్చి తర్వాత పాత నోట్లు కలిగి ఉంటే 4 ఏళ్ల జైలు శిక్ష విధించనుంది. పాత నోట్లతో లావాదేవీలు జరిపితే రూ.5 వేల జరిమానా విధించాలని నిర్ణయించింది. ఈమేరకు ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి భవన్ కు పంపాలని నిర్ణయించింది. మార్చి 31వ తేదీ తర్వాత పాత నోట్లను మార్చుకుంటే, వాళ్లకు 5 వేల జరిమానా విధించనున్నారు. అయితే పాత నోట్లను డిపాజిట్ చేయడంలో మాత్రం డెడ్ లైన్ మార్చలేదు.

కొత్త ఆర్డినెన్స్ కు 'ద స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ సెషేషన్ ఆఫ్ లయబెలిటీస్' ఆర్డినెన్స్ అని పేరు పెట్టారు. పది కంటే ఎక్కువ పాత నోట్లు కలిగి ఉన్నవాళ్లకు కూడా శిక్షను విధించనున్నారు. డిసెంబర్ 30 తర్వాత పాత నోట్లను కేవలం ఆర్బీఐలోనే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నవంబర్ 8న ప్రధాని మోదీ వెయ్యి, 500 నోట్లను రద్దు చేశారు. దాని వల్ల చెలామణిలో ఉన్న సుమారు 86 శాతం కరెన్సీ లావాదేవీలు ఆగిపోయాయి.

యూఎస్ వర్సిటీకి చెందిన ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ వీ.ఆచార్యను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా నియమిస్తూ కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది

No comments:

Post a Comment